Thursday, January 23, 2025

 రేషన్ బియ్యం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గట్టు: అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్ బియ్యంను గట్టు పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. గట్టు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గట్టు గ్రామానికి చెందిన ఎరుకలి ఉస్సేన్ అనే వ్యక్తి చుట్టు పక్కల గ్రామాలలో తక్కువ ధరకు రేషన్ బియ్యంను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడానికి రాయచూరుకు తరలించే క్రమంలో బ్లూకోట్ సిబ్బంది దివాకర్ నాయుడు, ప్రేమ్‌కుమార్ తారాపురం గ్రామ శివారులో పట్టుకుని తనిఖీ చేశారు. అందులో 45 సంచులలో సుమారు 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Ration Rice Seized in Gattu in Jogulamba

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News