Saturday, November 23, 2024

“రేషన్” ఆరింటికే ఓపెన్ కావాలి…

- Advertisement -
- Advertisement -

Ration shops should open at 6 o clock

 

ప్రజా పంపిణీ వ్యవస్థను , ప్రస్తుత లాక్ డౌన్ పరీస్థితిలో ఇష్టా రాజ్యంగా నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం రేషన్ షాపులను నడపాలని అలా కాకుండా..మాట వినక పోతే వేటు తప్పదని నారాయణ పేట జిల్లా పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం రేషన్ షాపులు విధిగా నడపాలని ఆదేశించారు.మామూలుగా ఐతే ఉదయం 8 గంటల నుంచి 12 గంటలవరకు మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక దుకాణాల నిర్వహణ ఉంటుందని అన్నారు. కానీ లాక్ డౌన్ నిబంధనల ప్రకారం జనం ఉదయం ఆరింటికే నిత్యావసరాల కొనుగోలు కోసం వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రత్యేక పరీస్థితిలో డీలర్లు ప్రత్యేక నిబంధనల ప్రకారం షాపులను నిర్వహించాలని స్పష్టం చేశారు.తాము తెరిచినపుడే రేషన్.. లేకపోతే పరేషాన్ ఆన్న చందంగా వ్యవరిస్తే..దుకాణాల రద్దు కు. అవకాశం ఇచ్చిన వారు అవుతారని అన్నారు. అటువంటి షాపుల రద్దు కు సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు.ప్రజలు రేషన్ పోర్టబిలిటీ సౌకర్యాన్ని సద్వినియోగ పరచుకొని, తమకు సమీపం లో ఉన్న షాపులో ఉదయమే రేషన్ తీసుకోవాలి అని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News