పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డీ టీ
మాచన రఘునందన్
మనతెలంగాణ/నారాయణపేట: ప్రైవేట్ స్కూల్ టీచర్లకు పంపిణీ చేయాల్సిన సన్న బియ్యంకు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు పెంచిన దరిమిలా, ఆయా నిర్ణీత చౌక దుకాణాలలో మాత్రమే తమ కోటా తీసుకునే అవకాశం సదరు ప్రైవేటు టీచర్లకు ఉంటుంది. కాబట్టి రేషన్ డీలర్లు విధిగా దుకాణాలు తెరచి ఉంచాలని పౌరసరఫరాలశాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ సూచన చేశారు. గడువు పొడిగించారు కదా ఎప్పుడైనా బియ్యం వేద్దాంలే.. అనే అలసత్వం వదిలి వచ్చిన వారికి వచ్చినట్లుగా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని చెప్పారు. టీచర్లు వచ్చినప్పుడు డీలర్లు షాపుల్లో లేకపోవడం. దుకాణాలు అసలు తెరచి ఉండడం లేదన్న కొన్ని ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, అందుకే టీచర్ల బియ్యం వారికి అందజేసే వరకు డీలర్లు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. డీలర్ల పోన్ నంబర్లను సైతం చౌక దుకాణాల వద్దకు వచ్చేవారికి కనిపించే విదంగా షాపు దగ్గర రాసి ఉంచాలని సూచించారు.