Monday, January 20, 2025

Ratnam: “రత్నం” టీజర్ లో రక్తపాతం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోలీవుడ్ మాస్ హీరో విశాల్ “రత్నం” సినిమాలో నటిస్తున్నారు. హీరో విశాల్‌తో హీరోయిన్ ప్రియా భవాన్నీ శంకర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిల్మ్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్ విడుదల చేశారు.

తలను నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడంతోనే గుస్ బంప్స్ వస్తున్నాయి. “కన్నీరే నెత్తురు చిందగా క్రోదమే రుధిరం చిమ్మగా ఆగ్రహమే అరుణధారగా… రణరంగమే రక్తపు ఏరుగా అంటూ” బ్యాక్ గౌండ్‌లో వచ్చే మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. విశాల్‌కు ఇది 34వ చిత్రం కాగా నాలుగు నెలల తరువాత ఈ సినిమా విడుదల కానుంది. మార్క్ అంటోని సినిమాతో విశాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News