Thursday, April 3, 2025

9 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని 9 మంది విద్యార్థినులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. బాధిత విద్యార్థినులను మంగళవారం ఉదయం పాఠశాల ఏఎన్‌యం అలివేలుస కొందుర్గు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థినులకు షాద్‌నగర్ డిప్యూటీ డిఎంహెచ్‌ఓ విజయలక్ష్మి రాథోడ్ చికిత్స చేసి అనంతరం పాఠశాలకు పంపించారు. గతంలో ఈ పాఠశాలకు సొంత భవనం లేక అద్దె భవనాల్లో కొనసాగడంతో విద్యార్థినులు నరకయాతను అనుభవించడంతో ప్రభుత్వం నూతన భవనాన్ని నిర్మించింది. పాఠశాల ఆవరణలో రాత్రి సమయంలో ఎలుకలు స్వైర్యవిహారం చేస్తుంటే పాఠశాల ప్రిన్సిపాల్ ఎందుకు చర్యలు తీసుకులేదని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష ధోరణి వల్లనే విద్యార్థినులను ఎలుకలు గాయపరచినట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగితే తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయంగా ఉందని పలువురు వాపోయారు. ఇకనైనా పాఠశాల పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News