Thursday, January 23, 2025

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కరిచిన ఎలుకలు.. తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోకి మళ్లీ ఎలుకలు వచ్చేశాయి. ఆస్పత్రిలో ఎలుకలు విచ్చల విడిగా తిరుగుతూ రోగులను కరుస్తుండంతో.. రోగులు, సహాయకలు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఐసియూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ అనే వ్యక్తి చేతిని ఎలుకలు కరిచి గాయపర్చాయి.

అనారోగ్యంతో గత వారం రోజులుగా షేక్ ముజీబ్.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎలుకలు ఐసియూలో ఉన్న ముజీబ్ చేతిని కరిచి గాయపర్చిన ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంతో ఐసీయూలోనూ ఎలుకలు తిరుగుతున్నాయని రోగులు, సహాయకులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News