Thursday, January 23, 2025

మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భునగిరి:మార్చురీలో ఉ ంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం… ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బా యపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు మొదటి భార్య చనిపోవటంతో రెండో వివాహం చేసుకున్నాడు.

ఇతడికి మొదటి భార్యకు పుట్టిన కూతురు, రెండో భార్యకు పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆదివారం రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు.

అయితే రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉ దయం కుటుంబ సభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన గాట్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ స్పందిస్తూ ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచా రం అవాస్తవమని చెప్పగా మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లిన సమయంలో ముఖంపై ఎలాంటి గాయాలు, గాట్లు కనిపించ లేదని భవనగరి టౌన్ ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కృష్ణ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News