Sunday, December 22, 2024

12 మంది బాలికలకు ఎలుకల కాటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నార్సింగి: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్ వద్ద కుక్కలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

9వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్న 12 మంది విద్యార్థులకు ఎలుకల కరిచినప్పటికి అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు కరవడంతో కొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులు చికిత్స చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స ర్కార్ బడులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రైవేట్ పాఠశాల లకు దీటుగా ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టం చేయాలనే వి ధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అ ధికారులు బేఖాతర్ చేస్తున్నారు.

సంబంధిత హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలు మీదకు వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ చుట్టుపక్కల పరిసరాలు కంపు కొడుతుండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, హాస్టల్ పరిసరాలు కుక్కలు సంచరిస్తూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంఘిక గురుకుల పాఠశాలల, కళాశాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రం చేయడంతోపాటు కుక్కలు, ఎలుకలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News