Wednesday, December 25, 2024

ఏటీఎంలో ఎలుకలు కొరికిన నోట్లు

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లో గల పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో ఎలుకలు దూరి అందులో ఉన్న నోట్లను కొరికాయి. ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వినియోగదారులకు ఎలుకలు కోరికిన నోట్లు రావడంతో ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఒక వ్యక్తి తొమ్మిది వేల రూపాయలు డ్రా చేయగా నోట్లన్నీ ఎలుకలు కొరికినవి ఉన్నాయి.  మరో వ్యక్తి మరో 1500 డ్రా చేయగా ఎలుకలు కొరికినవి వచ్చాయి. వెంటనే నోట్లను ఫోటోలు తీసిన వినియోగదారులు బ్యాంక్ అధికారులు విషయాన్ని గుర్తించి ఏటీఎంలో ఉన్న చిరిగిన నోట్లను మార్చడంతో పాటుగా తాము డ్రా చేసిన నోట్లను తీసుకొని మంచినోట్లను ఇవ్వాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News