Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌పై సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

పండర్‌పూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రం పండర్‌పూర్‌ను మంగళవారం సందర్శించడం పై శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ ప్రతికూలంగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)ని బీజేపీబీ టీమ్‌గా వ్యాఖ్యానించారు. శివసేన (యుబిటి),నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌లతో కూడిన మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వ అవకాశాలను దెబ్బతీయడానికి ప్రయత్నించడమే తప్ప బీఆర్‌ఎస్‌కు మహారాష్ట్రలో అంతకన్నా వేరేదేమీ లేదని రౌత్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా , కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గత ఎనిమిది తొమ్మిదేళ్లలో ఎన్నడూ పండర్‌పూర్‌ను కేసీఆర్ సందర్శించలేదని పేర్కొన్నారు. కేసీఆర్ తన బలాన్ని ఎవరికి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు ? అని ప్రశ్నించారు. “వ్యక్తిగతంగా కేసీఆర్ నాకు స్నేహితుడు. మనం ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నామో ఆయనే నిర్ణయించుకోవాలి. మహారాష్ట్ర రాజకీయాలపై బీఆర్‌ఎస్ ప్రభావం ఏమీ ఉండదు. ఈ చర్య తెలంగాణలో కేసీఆర్‌ను మాత్రమే దెబ్బతీస్తుంది” అని రౌత్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News