Monday, December 23, 2024

సక్సెస్ రవితేజను వెతుక్కుంటూ వస్తుంది..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీటీమ్ వరర్క్‌పైై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్‌గా నిర్మించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి భీమ్స్, హర్షవర్ధన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రైటర్ శ్రీకాంత్ ఈ సినిమాతో నెకస్ట్ లెవల్‌కి వెళ్ళాలి. తనతో టైగర్ నాగేశ్వర్ చేస్తున్నాను. హిరోఁధన్లు మేఘా, దక్ష, పూజిత, అను, ఫారియా సినిమాలో అద్భుతంగా నటించారు. సుధీర్ వర్మ నాకు ఇష్టమైన డైరెక్టర్. ఈ సినిమాతో అతను క్స్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని’ అని అన్నారు.

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ‘అద్భుతమైన కథ. ఇంత మంచి కథ డైరెక్ట్ చేయడానికి నన్ను ఎంచుకోవడం అనందంగా వుంది. హీరోయిన్స్ అందరూ అద్భుతంగా చేశారు. రవితేజ నటన ఎక్స్‌టార్డినరీగా ఉంటుంది. ఈ సినిమాలో చూసి థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు’ అని అన్నారు. శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ.. ‘రావణాసుర కథ ఇంత అద్భుతంగా రావడానికి కారణం రవితేజ. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వుండే వ్యక్తి ఆయన. ఆయన స్థితప్రజ్ఞుడు. అందుకే సక్సెస్ రవితేజను వెతుక్కుంటూ వస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశాంత్, నిర్మాత అభిషేక్, హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, దక్ష నగర్కర్, మేఘా ఆకాష్, ఎఎస్‌కెఎన్, వంశీ, సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, హనురాఘవపూడి, వివేక్ కూచిభొట్ల, హైపర్ ఆది, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News