Sunday, December 22, 2024

యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘రావణాసుర’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మంగళవారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో సినిమాలోని యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూపించారు. ఇందులో రవితేజ పాత్రలోని పలు షేడ్స్‌ని చూస్తాము. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. హర్షవర్ధన్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై థియేట్రికల్ ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News