Monday, December 23, 2024

‘రావణాసుర’ షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

‘Ravanasura’ shooting starts

 

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘రావణాసుర’. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం కీలక తారాగణంపై నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీం వర్క్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతున్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదు పాత్రలకు కూడా మంచి ప్రాముఖ్యత ఉండనుంది. రచయిత శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News