మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు. ఈరోజు రావణాసుర’ థీమ్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ హైలీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. ‘రావణ’ అనే చాంట్ తో మొదలైన ట్రాక్ వైబ్రెంట్ గా వుంది. పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ ఎనర్జిటిక్ గా అలపించారు. పాట చరణంలో వినిపించిన శివతాండవం గూస్ బంప్స్ తెప్పించింది. మేకర్స్ విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ థీమ్ సాంగ్ ‘రావణాసుర’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7,2023న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: రవితేజ, అభిషేక్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో: వంశీ-శేఖర్