Wednesday, January 22, 2025

జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ.. కెటిఆర్ బావమరిదిపై కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ కలకలం రేపుతోంది. మాజీ మంత్రి కెటిఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అర్థరాత్రి పోలీసులు దాడులు చేశారు. ఫామ్ హౌస్ లో భారీగా విదేశీ మద్యంతోపాటు క్యాసినో పరికాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ పార్టీలో 14 మంది మహిళలు కూడా పాల్గొన్నారని, పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్లు తెలుస్తోంది. డ్రగ్ పాజిటివ్‌గా తేలిన విజయ్‌ మద్దూరి అరెస్టు చేసిన పోలీసులు.. పార్టీ నిర్వహించిన కెటిఆర్ భావమరిది రాజ్‌ పాకాలపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News