Thursday, January 9, 2025

నైజాం అరాచాకాలపై గర్జించిన వీర యోధుడు రావి నారాయణరెడ్డి

- Advertisement -
- Advertisement -

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం అరాచాకాలపై గర్జించిన వీర యోధుడు రావి నారాయణరెడ్డి అని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి అగ్రభాగాన ఉండి నైజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థ అంతమొందించే వరకు అలుపెరుగని పోరాటాలు చేసాడని గుర్తు చేశారు.

ప్రముఖ కమ్యూనిస్టు నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజాస్వామ్యవాది, పద్మవిభూషణ్ రావి నారాయణరెడ్డి 116 వ జయంతి ఉత్సవాలను తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ హైదరాబాద్, బంజారా హిల్స్. లోటస్ పాండ్ వద్ద ఉన్న రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి తొలుత రావి నారాయణరెడ్డి విగ్రహానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హైదరాబాద్ స్టేట్ లో గ్రామగ్రామాన రైతాంగ పోరాటాన్ని పెను తుపానులా హోరెత్తించిన విప్లవ వీరుడు, హైదరాబాదు సంస్థానంలో విధ్వంసంకాండతో నరమేధం సృష్టించిన రజాకార్ల ఆకృత్యాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగాఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసి రావి నారాయణరెడ్డి చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం కొనియాడారు.

1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్థిగా నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాటి ప్రధాని నెహ్రు కంటే ఎక్కువ ఓట్లు సాధించి పార్లమెంటులో తొలి అడుగుపెట్టిన ఘనత రావి నారాయణరెడ్డి సాధించాడని చెప్పారు. తన 500 ఎకరాల సొంత భూములను పేదలకు దానం చేసి అణగారిన వర్గాలకు అండగా నిలిచినా రావి నారాయణరెడ్డి ఆశయాలను కొనసాగించాలని సురవరం సుధాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, కోశాధికారి ఉజ్జిని రత్నాకర్ రావు, సభ్యులు రావి ప్రతిభ రెడ్డి, ఎఐటియుసి సీనియర్ నాయకులు డా. బి.వి.విజయలక్ష్మి, సంఘ సేవకులు రావి రిషికేష్ రెడ్డి, అప్పా రావు, కృష్ణ కుమారి, రమేష్, తెలంగాణ ప్రజానాట్య మండలి నేతలు కె.లక్ష్మి నారాయణ, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News