Monday, December 23, 2024

వణుకు పట్టుకునే విమర్శలు

- Advertisement -
- Advertisement -

పాట్నా : పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నాయని పాట్నాలో బిజెపి సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. ఆర్థిక క్రమశిక్షణలో భాగంగానే ఈ చర్యకు దిగినట్లు ఆర్‌బిఐ సుదీర్ఘ ప్రకటన వెలువరించిందని , మరి విద్యావంతుడని తెలిపే కేజ్రీవాల్ దీనిని అర్థం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు క్రమేపీ తగ్గుముఖం పటింది.

కాంగ్రెస్ హయాంలో కూడా నోట్ల రద్దు జరిగిందనే విషయం కాంగ్రెస్‌కు తెలియదా? దీనిని అప్పుడు నోట్‌బందీగా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. పెద్ద నోట్లతో నగదు అక్రమలావాదేవీలకు దిగేవారికి ఈ నోట్ల రద్దు నిజంగానే వణుకుపుట్టిస్తుందని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. రెండు వేల నోటు ఇప్పటికీ చెల్లుతుందని దీని గురించి కేజ్రీవాల్‌కు తెలియదా? అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News