Saturday, November 16, 2024

లెజెండ్స్ క్రికెట్ లీగ్ కమిషనర్‌గా రవిశాస్త్రి

- Advertisement -
- Advertisement -

Ravi Shastri as Commissioner of Legends Cricket League

ముంబయి: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది జనవరినుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్‌ఎల్‌సి)కు కమిషనర్‌గా వ్యవహరించనున్నాడు. ‘ వివిధ దేశాల క్రికెట్ లెజెండ్స్‌తో కలిసి పని చేసే అవకాశం లభించడం గొప్ప విషయం. లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో ప్రత్యేకమైన టోర్నమెంట్.ఈ లీగ్‌లో దిగ్గజ ఆటగాళ్లు మరోసారి మైదానంలో తలపడనున్నారు. కొత్తగా వాళ్లు నిరూపించుకోవడానికి ఏమీ లేకపోయినా వాళ్లు ఆడుతుంటే చూడడం అభిమానులకు గొప్ప అనుభూతినిస్తుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ లీగ్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన మాజీ దిగ్గజక్రికెటర్లు పాల్గొననున్నారు. ఇండియా, ఆసియా, రెప్ట్ ఆఫ్ ది వరల్డ్ పేర్లతో మూడు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత టి20 ప్రపంచకప్ టోర్నమెంట్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టి20 సిరీస్‌తో రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News