- Advertisement -
ముంబై: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పేలవమైన ప్రదర్శనపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశాడు. బట్లర్, రూట్, స్టోక్స్, మోయిన్, బెయిర్‌స్టో వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్న ఇంగ్లండ్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తేలిపోవడం బాధించే అంశమన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ ఇలాంటి చెత్త ప్రదర్శన చేస్తుందని తాను ఊహించలేదన్నాడు.
వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా గుణపాఠం నేర్చుకోక పోవడం మరింత ఆందోళన కలిగించే అంశమన్నాడు. ప్రపంచంలోనే ఇంగ్లండ్ బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఈసారి ఆ జట్టు అలవోకగా సెమీస్‌కు చేరుకుంటుందని అందరూ భావించారన్నాడు. అయితే ఇంగ్లండ్ మాత్రం వరుస ఓటములతో అందరి అంచనాలను తారుమారు చేసిందని రవిశాస్త్రి వాపోయాడు.
- Advertisement -