- Advertisement -
ప్రపంచ క్రికెట్‌లోనే విరాట్ కోహ్లిని మించిన బ్యాటర్ లేడని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వన్డే కెరీర్‌లో విరాట్ కోహ్లి 50వ శతకం సాధించడంపై అతను స్పందించాడు. ప్రపంచకప్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడని, అతని జోరును చూస్తుంటే ఒకప్పటి రన్ మెషీన్ గుర్తుకు వస్తున్నాడన్నాడు. ఇదే జోరును కొనసాగిస్తే భవిష్యత్తులో అతను ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని జోస్యం చెప్పాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వంద శతకాల రికార్డును కోహ్లి తిరగరాయడం తథ్యమన్నాడు. మరో మూడు నాలుగేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగే సత్తా విరాట్‌కు ఉందన్నాడు. ఇదే జరిగితే కెరీర్ ముగించేలోపు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమన్నాడు.
- Advertisement -