Friday, November 8, 2024

నేనే బాధ్యుడిననడం సరికాదు: రవిశాస్త్రి

- Advertisement -
- Advertisement -

లండన్: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ కొవిడ్ కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా బృందంలో ఒక సపోర్టిగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అయిదో టెస్టును రద్దు చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ప్రధాన కారణం టీమిండియా కోచ్ రవిశాస్త్రితో పాటుగా ఇతర ఆటగాళ్లు ఒక బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడమే. బిసిసిఐ అనుమతి తీసుకోకుండా ఆ ఈవెంట్‌కు వెళ్లడంతో రవిశాస్త్రితో పాటుగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లకు కొవిడ్ సోకింది. అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను ద్దు చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.

‘మిడ్‌డే’ పత్రికతో మాట్లాడిన శాస్త్రి తనను తాను సమర్థించుకున్నాడు. ‘యుకె మొత్తం తెరిచారు. ఎక్కడా ఎలాంటి ఆంక్షలు లేవు. ఏదైనా జరిగి ఉంటే తొలి టెస్టునుంచే జరిగి ఉండవచ్చు కదా?’ అని ప్రశ్నించాడు. బోర్డు అనుమతి తీసుకోకపోవడంపై ఇప్పటికే బిసిసిఐ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీను వివరణ కోరిన విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ ముందు వారిపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. ఇక ఆంగ్లాండ్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందనిఈ సందర్భంగా రవిశాస్త్రి అన్నాడు. ఈ కొవిడ్ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఏ టీమ్ కూడా ఇండియాలాగా ఆడలేదని అభిప్రాయపడ్డాడు.

Ravi Shastri responds over Ind vs Eng 5th Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News