మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఖిలాడీ’ చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన తదుపరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఫైనల్ చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు శరత్ మండవతో ఓ సినిమాకి కమిటయ్యాడు. జూలై 1 నుండి హైదరాబాద్‌లో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇది ఎస్.ఎల్.వి సినిమాస్ ఎల్.ఎల్.పిలో నాలుగో చిత్రంగా మొదలు కానుంది. నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కే యూనిక్ థ్రిల్లర్ ఇది. రవితేజను ఇంతవరకు చూడని సరికొత్త పాత్రలో చూపించనున్నారు. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ నాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 1 నుండి హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో టీమ్ అంతా పాల్గొంటుంది. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా చేయనున్నారు.
జూలై 1 నుండి యూనిక్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -