Wednesday, January 22, 2025

రవితేజ కొత్త సినిమా షూటింగ్ ఆరంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతోంది. నేడే ఆ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. షూటింగ్ ను కూడా ఆరంభించారు. ఇది రవితేజ 75వ (ఈ సినిమా పేరు తాత్కాలికంగా ఆర్ టి 75 అంటున్నారు) సినిమా. రవితేజ, శ్రీలీల కలిసి 2022లో ‘ధమాక’ సినిమాలో నటించారు.

సితార నాగవంశీ- సాయి సౌజన్య ఈ కొత్త సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా మాస్ యాక్షన్ జోనర్ గా ఉండబోతోంది.  కామెడీ కూడా జోడించబోతున్నారు. ఇంకా మొత్తం తారాగణం ఎంపిక జరగలేదు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదికి రాబోతున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News