Sunday, December 22, 2024

రవితేజ ‘ధమాకా’ టీజర్‌ విడుదల…

- Advertisement -
- Advertisement -

Ravi Teja's Dhamaka teaser released

హైదరాబాద్: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. చిత్రబృందం తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసి సినీఅభిమానులను, రవితేజ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రవితేజ, పెళ్ళి సంద‌D ఫేం శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్‌లో ఖచ్చితమైన కామెడీ, యాక్షన్ ఉన్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమా వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్న గెటప్స్‌లో ఒకటి క్లాస్‌, మరోకటి మాస్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News