Friday, November 22, 2024

రవితేజను చూస్తే చాలు పాటలు పుడతాయి

- Advertisement -
- Advertisement -

 

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈనెల 23న ‘ధమాకా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “సినిమాలోని ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతి పాట మిలియన్స్ కొద్దీ వ్యూస్‌ని సాధించాయి.

ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ‘ధమాకా’కి ఖచ్చితంగా రీసౌండ్ వస్తుందనే నమ్మకం వుంది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చేశాను. అది బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ‘ధమాకా’తో రెండో సినిమా చేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను. రవితేజ నాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు. ఆయనను చూస్తే చాలు పాటలు పుడతాయి. రవితేజ కటౌట్ చూసినా పాటలు పుడతాయి. ఇక ‘ధమాకా’లో ఊహించని మలుపులతో సాగే కథనం వుంటుంది. సినిమాలో రవితేజ క్లాసు, మాసు పాత్రలకు తగ్గట్టు పాటలు డిజైన్ చేశాం.

కిక్ సినిమాలో ‘ఒరేయ్ ఆజా మూ.. లగెత్తరో’ అని రవితేజ చెప్పిన డైలాగు చాలా పాపులర్. ‘ధమాకా’లో పాటలు చేస్తున్నపుడు పాట చివరిలో ఏదో ఒక మెరపు వుండాలనిపించింది. పాటలో చివరలో ‘ఓ సిసిరోలియో ఏరా అప్పుడే ఆపేశావ్ ఇంకోసారి దరువేసుకో’ అనే డైలాగ్‌ని మొదట డైరెక్టర్‌తో అనిపించాను. ఇది రవితేజతో అనిపించాలి. ఆయన్ని ఏదో రకంగా ఒప్పించాము. ఆయన అంత బిజీ షెడ్యుల్‌లో కూడా స్టూడియోకి వచ్చి అది పాడారు. ‘ధమాకా’లో మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన జింతాక్, వాట్స్ హ్యాపెనింగ్, మాస్ రాజా, డుడు.. పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. మరో పాట ఉంది. అది నేనే రాసి పాడాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News