Thursday, November 14, 2024

విక్రమ్ సింగ్ రాథోడ్ తర్వాత సంతృప్తినిచ్చిన పాత్ర: రవితేజ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రసంశలు అందుకుంటూ దసరా విన్నర్ గా అలరిస్తోంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, నా తమ్ముళ్ళయిన అభిమానులు అందరూ గొప్పగా  ప్రశంసిస్తున్నారు. వాళ్ళే సినిమాని బ్రహ్మండంగా ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా వుంది. మధి అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ నేపధ్య సంగీతం, అద్భుతమైన సెట్స్ వేసిన అవినాష్ కొల్లా, చంద్రబోస్, భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.. ఇలా అన్నిటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో మరో హైలెట్ యాక్షన్. పీటర్ హెయిన్ ట్రైన్ ఎపిసోడ్, మిగతా యాక్షన్ సీక్వెన్స్ ని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా చక్కగా చేశారు.

ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ వారికి కూడా దక్కుతుంది. మా డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సాతో ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. తనలో చాలా ప్రతిభ వుంది. మా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తీశారు. భవిష్యత్ లో కూడా ఇంకా భారీ సినిమాలు తీయాలని, సూపర్ డూపర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఇందులో నాతో పాటు నటించిన నటులంతా అద్భుతంగా తమ పాత్రలని పోషించారు. వీరందరికీ మంచి మంచి అవకాశాలు వస్తాయని భావిస్తాను. దర్శకుడు వంశీ కొత్తవాళ్ళతో కూడా అద్భుతంగా చేయించారు. ఇందులో జీషు, అనుపమ్ ఖేర్, హరీష్, రేణు దేశాయ్ గారు అద్భుతంగా చేశారు. ఇందులో ఆర్టిస్ట్ లు కనిపించరు.

పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అలాంటి నటనని రాబట్టుకోవడం వెనుక దర్శకుడు వంశీ వున్నారు, నిజంగా వంశీ ఇంత చక్కగా చేస్తారని ఊహించలేదు. వంశీ ఇంకా చాలా చేయాలి. తను నెక్స్ట్ లెవల్ కి వెళ్తారనే నమ్మకం వుంది. తనకి ఆ సామర్ధ్యం వుంది. తనతో మళ్ళీ ట్రావెల్ అవ్వాలి. మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. విక్రమ్ రాథోడ్ తర్వాత నాకు మళ్ళీ అంతటి సంతృప్తిని ఇచ్చిన పాత్ర ‘టైగర్ నాగేశ్వరరావు’. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు” తెలిపారు.

దర్శకుడు వంశీ కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ‘టైగర్ నాగేశ్వరరావు’కు ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన వస్తోంది. ప్రతి సన్నివేశాన్ని, డైలాగ్ ని ప్రేక్షకులు గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు. గూస్ బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు. రవితేజ గారి నటన, ఎమోషన్స్, యాక్షన్ ఇలా ప్రతిది ప్రేక్షకులని అలరిస్తోంది. నాకు ఇది పెద్ద సినిమా. రవితేజ గారు, నిర్మాత అభిషేక్ గారి వలనే ఇది సాధ్యపడింది. సినిమాకి మేము ఊహించి స్పందన రావడం దర్శకుడిగా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.

జీవీ ప్రకాష్, మది, అవినాష్ కొల్లా, చంద్రబోస్, భాస్కర భట్ల, శ్రీకాంత్.. సినిమాకి పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి పేరుపేరున థాంక్స్. దాదాపు నాలుగేళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయాణించాం. నిర్మాత అభిషేక్ ఎంతో సపోర్ట్ చేశారు. మాయంక్, ముకేష్ కి థాంక్స్.  ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. సినిమా చూసిన ప్రేక్షకులు ఎపిక్ అని, మరికొందరు  మాస్టర్ పీస్ అంటున్నారు. ఇది ప్రేక్షకుల సినిమా. ప్రేక్షకులే ముందుకు తీసుకువెళ్తున్నారు. రవితేజ గారు నాకు గొప్ప ఫ్లాట్ ఫామ్ ఇచ్చారు. ‘’వీడు మావాడ్రా’’ అని చెప్పుకునేలా సినిమాలు తీస్తూనే వుంటాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రవితేజ గారికి మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్  మాట్లాడుతూ..  మాకు ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. రవితేజ గారితో మరోసారి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ మొదలుకావడానికి ప్రధాన కారణం వివేక్ గారు. వివేక్ గారిని ఎప్పుడూ మర్చిపోను. వారికి ధన్యవాదాలు. దర్శకుడు వంశీ ఏదైతే చెప్పారో అది తెరపై అద్భుతంగా చూపించారు. ప్రేక్షకుల నుంచి స్పందన, కలెక్షన్స్, షోస్, రోజురోజుకి పెరుగుతున్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ కోసం పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మరిన్ని వేడుకలు వుంటాయి’’ అని తెలిపారు.

వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రవితేజ గారు విశ్వరూపం చూపించారని చెబుతున్నారు. అంత మంచి పెర్ ఫార్మెన్స్ తీసుకున్న వంశీ గారికి, సినిమాని నిర్మించిన అభిషేక్, మాయంక్ గారికి అందరికీ అభినందనలు. సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అందరూ చాలా హ్యాపీగా వున్నారు. కలెక్షన్స్ చాలా బావున్నాయని చెబుతున్నారు. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’’ తెలిపారు.

మయాంక్ సింఘానియా మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు అభిమానులకు ధన్యవాదాలు. దర్శకుడు వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాత అభిషేక్ గారి సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యపడేది కాదు. రవితేజ గారి సపోర్ట్ కి కృతజ్ఞతలు. రవితేజ గారు మరోసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు. ఈ విజయం అందరిది’ అన్నారు. ఈ సక్సెస్ మీట్ లో ప్రవీణ్, కిషోర్ కుమార్, జ్వాలా కోటి, వినోద్ వర్మ, శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News