Saturday, November 9, 2024

‘టైగర్ నాగేశ్వరరావు’ చివరి షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ ఏడాది విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టూవర్టుపురం గ్రామాన్ని రూపొందించడానికి భారీ బడ్జెట్‌ను కేటాయించారు.

నిన్న రాత్రి వైజాగ్‌లో చిత్ర బృందం చివరి షెడ్యూల్‌ను ప్రారంభించింది. చివరి షెడ్యూల్‌లో కోర్ టీమ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి క్యురియాసిటీ పెంచింది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో పాటు ప్రీ లుక్ పోస్టర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

టైగర్ నాగేశ్వరరావు స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. 1970ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో అలరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News