Sunday, December 22, 2024

రవితేజకు శస్త్ర చికిత్స

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ ఇటీవల మిస్టర్ బచ్చన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం ఆయన తన నెక్స్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు డైరెక్టర్‌గా రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా రాబోతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆర్‌టి75 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ కుడిచేతికి గాయమైంది.

అయినా కూడా ఆయన షూటింగ్‌లో పాల్గొనడంతో, గాయం తీవ్రత ఎక్కువైంది. దీంతో ఆయనకు యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. రవితేజ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల మరోసారి ఆయనకు జోడీగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News