Sunday, December 22, 2024

అశ్విన్ @ 500

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అరుదైన రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అశ్విన్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో తన 500వ వికెట్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా 500 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్ కొత్త రికార్డును సృష్టించాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ మెక్‌గ్రాత్ తర్వాత అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్‌ను అందుకున్న బౌలర్ అశ్వినే కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో 500 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతని కంటే ముందు మరో దిగ్గజం అనిల్ కుంబ్లే ఈ రికార్డు అందుకున్నాడు. కుంబ్లే 612 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 98 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News