Sunday, January 19, 2025

అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై..

- Advertisement -
- Advertisement -

టీమిండియా సీనియర్ క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అనంతరం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షం కారణంగా డ్రా అయినట్లు అంపైర్లు ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశంలో అశ్విన్‌.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించారు. అయితే, అంతకుముందు మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సో షల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అశ్విన్… టెస్టు క్రికెట్ 537 వికెట్లు తీశాడు. దీంతో ఇండియా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అతను కంటే ముదే దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో ముందున్నాడు. ఇక, భారత్ తరపున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో అశ్విన్ 775 వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News