Wednesday, January 22, 2025

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఆసియా గడ్డపై అత్యధిక వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా అశ్‌విన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ అనిల్ కుంబ్లేను అశ్విన్ వెనక్కి నెట్టాడు. ఇప్పటి వరకు కుంబ్లే 419 వికెట్లతో ఆసియాలో అత్యధిక వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

తాజాగా అశ్విన్ ఈ రికార్డును అధిగమించాడు. బంగ్లా కెప్టెన్ శాంటో వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 420 వికెట్లతో ఆసియాలో అత్యధిక వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, అశ్విన్ ఇటీవే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News