- Advertisement -
భారత స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అశ్విన్‌కు ప్రదానం చేశారు. భారత క్రికెట్‌కు అశ్విన్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును బహూకరించారు. భారత క్రికెట్‌కు లభించిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో అశ్విన్ ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు కొనసాగిన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తన అద్భుత బౌలింగ్‌తో అశ్విన్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టారు.
- Advertisement -