Sunday, December 22, 2024

అశ్విన్‌కు మళ్లీ టాప్ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

రోహిత్, యశస్వి ముందుకు, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. సహచరుడు జస్‌ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని ఆరో స్థానంలో నిలిచాడు. యువ సంచలన యశస్వి జైస్వాల్ రెండు ర్యాంక్‌లు ఎగబాకి 8వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక ర్యాంక్ కోల్పోయి 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విలియమ్సన్ 859 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంక్‌లో నిలిచాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 824 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్ రెండు స్థానాలు మెరుగుపడి మూడో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) ఒక ర్యాంక్ పైకి ఎగబాకి నాలుగో స్థానంలో, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 పాయింట్లతో ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. దిముత్ కరుణరత్నె (శ్రీలంక) ఏడో, యశస్వి జైస్వాల్ (భారత్) 8వ, విరాట్ కోహ్లి (భారత్) తొమ్మిదో స్థానంలో నిలిచారు. హారీ బ్రూక్ (ఇంగ్లండ్) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
అశ్విన్ హవా..

మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ తిరిగి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇం గ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొమ్మిది వికెట్లను పడగొట్టిన తాజా ర్యాంకింగ్స్‌లో నం బర్‌వన్‌గా నిలిచాడు. ప్రస్తుతం అశ్విన్ 870 రే టింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలి యా), జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) 847 పా యింట్లతో సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. కగిసో రబడా (సౌతాఫ్రి కా) నాలుగో, ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఐ దో ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

భారత స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా నంబర్‌వన్‌గా నిలిచాడు. అశ్విన్ రెండో స్థానం లో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాం కింగ్స్‌లో భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. 122 రేటింగ్ పాయింట్లతో టీమిండి యా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలి యా రెండో, ఇంగ్లండ్ మూడో, సౌతాఫ్రికా నాలుగో, న్యూజిలాండ్ ఐదో స్థానాల్లో నిచలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News