Sunday, January 19, 2025

ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు విజిలెన్స్ బృందాలు

- Advertisement -
- Advertisement -

 తరుగు తీస్తే క్రిమినల్ కేసులు
 ధాన్యానికి మిల్లర్ అక్నాలెడ్జ్ ఇవ్వాలి
 జాప్యం చేస్తే జిల్లా మేనేజర్లపై చర్యలు: చైర్మన్ రవీందర్ సింగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోలు ప్రక్రియన పర్యవేక్షించేందకు విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేసిట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్ధార్ రవీందర్‌సింగ్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్దమని తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని రైస్ మిల్లర్లను హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి తరుగు పేరుతో కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల తరుగు సమస్య వస్తుందన్న ఫిర్యాదులపై ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవడం జరిగింది. అధికారుల అలసత్వంవల్ల రైతులు ఇబ్బందులకు గురైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అధికారులతో బుధవారం సంస్థ ఛైర్మన్ రవీందర్‌సింగ్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ చర్యలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కృషి వల్ల రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా ధాన్యం దిగుబడి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీనికి అణుగుణంగా మనందరం కలిసి పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభు త్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా తరుగు సమస్యలు రాకుండా పకడ్భంది చర్యలు తీసుకోవాలని, సంస్థలో సీనియర్ అధికారులు జిల్లాల వారిగా ప్రతిరోజూ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని సూచించారు. అలాగే పౌరసరఫరాల సంస్థ విలిజెన్స్ ఆండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులతో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు వివరాలను మిల్లర్లు ట్రాక్ షీట్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్నట్టు ఇటీవల తాను వివిధ జిల్లాలో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిందన్నారు.

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే రైస్ మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దించుకుని వివరాలను ట్రాక్ షీట్లో నమోదు చేయాలని ఈ విషయంలో ఎక్కడ జాప్యం జరిగినా దాని ప్రభావం మద్దతు ధర చెల్లింపులపై పడుతుందన్న విషయాన్ని గుర్తించి అధికారులు పనిచేయలన్నారు. దించుకున్న ధాన్యానికి మిల్లర్ అక్నాలెడ్జ్ ఇవ్వకుండా జాప్యం చేస్తే దీనికి జిల్లా మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News