Monday, December 23, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజా

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.  జూన్ 30వ తేదీ ఆదివారం టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా జడేజా తెలిపారు. అయితే.. వన్డే, టెస్టు ఫార్మాట్లలో కొనసాగుతానని చెప్పారు.

‘‘నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇతర ఫార్మాట్‌లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తా. టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే కల నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’  అని జడేజా తన ఇన్‌స్టా ఖాతాలో తెలిపారు.

కాగా,  2009లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 74 టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 54 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News