Monday, December 23, 2024

హైసెన్స్ ప్రచారకర్తగా రవీంద్ర జడేజా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన హైసెన్స్, తమ టెలివిజన్, ఏసి, రిఫ్రిజిరేటర్ విభాగాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రఖ్యాత క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను నియమించుకున్నట్లు వెల్లడించింది. భారతీయ మార్కెట్లో కంపెనీకి మొదటి ప్రచారకర్తగా జడేజా నిలిచారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం శ్రేష్ఠత, వైవిధ్యత, ఆవిష్కరణల పట్ల హైసెన్స్ యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది, ఇది యువ, ఔత్సాహిక వినియోగదారులలో జడేజా యొక్క అద్భుతమైన నైపుణ్యాలు, ప్రజాదరణను ప్రతిబింబిస్తుంది.

క్రీడలు మరియు క్రీడా తారలను యువతకు సన్నిహితంగా తీసుకువచ్చే హైసెన్స్ యొక్క గ్లోబల్ బ్రాండ్ సంస్కృతికి అనుగుణంగా, ఈ కంపెనీ హైసెన్స్ గ్రూప్ ఫిలాసఫీకి అనుగుణంగా క్రికెట్ ప్రపంచంలో ఒక ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. గ్రూప్ సంస్కృతికి సంబంధించిన ఈ అన్వేషణ హైసెన్స్ ని క్రికెట్ రంగంలోకి తీసుకువస్తుంది. ఇది టీమ్ ఇండియా యొక్క ప్రముఖ ఆల్ రౌండర్, పవర్ ప్యాక్ పెర్ఫార్మర్ అయిన సర్ రవీందర్ జడేజా గొప్ప భాగస్వామ్యం ను మించినది లేదు.

రవీంద్ర జడేజా, క్రికెట్‌లో తన అసాధారణమైన ఆల్-రౌండ్ సామర్ధ్యాల ద్వారా మహోన్నత క్రికెటర్ గా గుర్తింపు పొందారు, ఇది హైసెన్స్ యొక్క విభిన్న ఉత్పత్తుల శ్రేణి యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. క్రికెట్‌లోని వివిధ అంశాలలో జడేజా రాణిస్తున్నట్లే, అత్యాధునిక టెలివిజన్‌ల నుండి విద్యుత్ అదా చేసే సమర్థవంతమైన ఎయిర్ కండిషనర్లు, ఆధారపడదగిన రిఫ్రిజిరేటర్‌ల వరకూ ఉత్పత్తుల యొక్క సమగ్ర శ్రేణి ఎంపికను హైసెన్స్ అందిస్తుంది. ఈ భాగస్వామ్యం, దేశవ్యాప్తంగా వినియోగదారుల నడుమ ప్రతిధ్వనించే వైవిధ్యత, శ్రేష్ఠతకు పరస్పర నిబద్ధతను సూచిస్తుంది.

రవీంద్ర జడేజా వంటి స్పోర్ట్స్ ఐకాన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్ పోర్ట్‌ఫోలియోలో చేర్చడం, హైసెన్స్ కు ఒక ముఖ్యమైన ముందడుగు, ఎందుకంటే కంపెనీ భారతీయ మార్కెట్లో తమ కార్యకలాపాలను విస్తరించడం కొనసాగిస్తోంది. ఈ భాగస్వామ్యం క్రీడలు, వినోద ప్రపంచాలతో దాని అనుబంధాన్ని బలపరుస్తుంది, వ్యక్తిగత, అర్థవంతమైన స్థాయిలో దాని వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి బ్రాండ్ యొక్క అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి హైసెన్స్ ఇండియా సీఈఓ ప్రణబ్ మొహంతి తన సంతోషాన్ని వెల్లడిస్తూ..”రవీంద్ర జడేజాను టెలివిజన్, ఏసీ మరియు రిఫ్రిజిరేటర్ విభాగాలకు సంబంధించి మా బ్రాండ్ అంబాసిడర్‌గా హైసెన్స్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ ప్రకటన వ్యూహాత్మకంగా, సమయానుకూలంగా జరిగింది. త్వరలో భారత్‌లో క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. క్రికెట్ మైదానంలో, వెలుపల అతని అసాధారణ నైపుణ్యాలు అతనిని మా బ్రాండ్ విలువలకు పరిపూర్ణ స్వరూపులుగా చేస్తాయి. హైసెన్స్ తో ఆయన భాగస్వామ్యం మా యువత, ఔత్సాహిక వినియోగదారుల నడుమ ప్రతిధ్వనిస్తుందని మేము నమ్ముతున్నాము. మార్కెట్ పట్ల మా లోతైన అవగాహనా భారతీయ వినియోగదారుల హృదయాన్ని చేరుకోవాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. వారి మనస్సుల పై తీవ్ర ప్రభావాన్ని సృష్టించాలని మేము నిశ్చయించుకున్నాము” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి తన ఆనందాన్ని రవీంద్ర జడేజా వ్యక్తం చేస్తూ.. ” ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అతిపెద్ద & గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్‌లతో భాగస్వామ్యం కలిగి ఉండటం తో పాటుగా శ్రేష్ఠత, ఆవిష్కరణల పట్ల నా అభిరుచిని పంచుకునే బ్రాండ్, హైసెన్స్ బ్రాండ్. దీని అంబాసిడర్‌గా నిలవటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. హైసెన్స్ యొక్క విభిన్న శ్రేణి ఉత్పత్తులు క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. హైసెన్స్ ప్రయాణంలో భాగం కావటం తో పాటుగా బ్రాండ్ యొక్క యువ, ఔత్సాహిక వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.

ఈ భాగస్వామ్యంతో హైసెన్స్ తమ మొదటి ప్రచారం ‘‘పర్ఫెక్టింగ్ ది పర్ఫెక్షన్’’ ను టెలివిజన్, ఏసీ, రిఫ్రిజిరేటర్ వంటి హైసెన్స్ ఉత్పత్తులతో రవీంద్ర జడేజాతో కలిసి విడుదల చేస్తోంది. ఈ వినియోగదారు ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారు 4K హైసెన్స్ స్మార్ట్ టీవీని గెలుచుకోవచ్చు.

హైసెన్స్, రవీంద్ర జడేజా మధ్య ఈ భాగస్వామ్యం, భారతదేశ మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేయడానికి హైసెన్స్ చేసిన వ్యూహాత్మక ముందడుగు, ఇది భారతీయ గృహాలకు ఆవిష్కరణ, శ్రేష్ఠత, వైవిధ్యతను తీసుకువస్తుందని వాగ్దానం చేసే ఉత్తేజకరమైన ప్రయాణానికి నాంది పలికింది. ఈ పండుగ సీజన్‌లో హైసెన్స్ U7K, U6K మరియు E7K వంటి కొత్త, వినూత్నమైన టీవీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది, ఇది రాబోయే క్రికెట్ ప్రపంచ కప్‌ను ఆస్వాదించడానికి స్టేడియం అనుభవాన్ని ఇంటికి తీసుకువస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News