Wednesday, January 22, 2025

రవీంద్ర జడేజా మరో నయా రికార్డు..

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో మరో రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఒకే సీజన్‌లో 50 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 202325 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో జడేజా 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ సీజన్‌లో భారత మరో స్టార్ స్పిన్నర్ అశ్విన్ 62 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, జడేజా ఓవరాల్‌గా డబ్లూటిసి టోర్నీలో ఇప్పటి వరకు 126 వికెట్లు పడగొట్టి ఏడో స్థానంలో నిలిచాడు. అశ్విన్ 194 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News