- Advertisement -
మొహాలీ: మొహాలీలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఇన్నింగ్స్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. తొలి టెస్టు మ్యాచులో *175 పరుగులు చేశాడు. భారత్ తరుపున టెస్టుల్లో ఏడో నంబర్ బ్యాటర్ గా అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్ 163 పేరిట ఉండేది. ఇప్పుడు జడేజా బ్రేక్ చేశాడు. 159 పరుగులతో రిషబ్ పంత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ టెస్టులో జడేజా 228 బంతుల్లో 3 సిక్సులు, 17 ఫోర్లతో 175 రన్స్ చేశాడు. జడేజా 25 పరుగుల దూరంలో ఉండగా టీమిండియా మ్యాచ్ డిక్లైర్డ్ ప్రకటించడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
- Advertisement -