Thursday, November 21, 2024

ధోనీ రికార్డు బద్దలుకొట్టిన రవీంద్ర జడేజా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పంజాబ్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్‌పై జడేజా 43 పరుగులు చేయడంతో మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా మ్యాన్ ఆప్ ది మ్యాచ్ వరించింది. ఐపిఎల్ చెన్నై తరపున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న క్రికెటర్‌గా జడేజా రికార్డు సృష్టించాడు. గతంలో కెప్టెన్ ధోనీ 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా జడేజా 16 సార్లు అందుకున్నాడు. ధోనీ రికార్డును జడేజా అధిగమించాడు.

సిఎస్‌కె జట్టులో జడేజా 16 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో తొలి స్థానంలో ఉండగా వరసగా ధోని(15), సురేష్ రైనా(12), రుతురాజ్ గైక్వాడ్(11), మైక్ హస్సీ(10) ఉన్నారు. కానీ ధోని పుణే జట్టు తరుపున ఆడినప్పుడు రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలుగుకొని అతడి ఖాతాలో 17 ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఐపిఎల్‌లో ఎబి డివిలియర్స్ అత్యధికంగా 25 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొని తొలి స్థానంలో ఉండగా వరసగా క్రిష్ గేల్(22), రోహిత్ శర్మ(19), డేవిడ్ వార్నర్(18), ఎంఎస్ ధోనీ(17), విరాట్ కోహ్లీ(17), రవీంద్ర జడేజా(16), యూసఫ్ ఫఠాన్(16) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News