Sunday, January 19, 2025

ఆ ఇద్దరు రికార్డులు రవీంద్ర జడేజా ఖాతాలోకి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత జట్టులో ప్రస్తుతం ఆల్‌రౌండర్ ప్రాత్ర వహిస్తుంది రవీంద్ర జడేజా ఒక్కడే. బౌలింగ్‌తో పాటు అప్పుడప్పుడు బ్యాటింగ్‌లో మెరుస్తుంటాడు. తాజాలో 2023 వరల్డ్ కప్‌లో అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. భారత తరపున 1996 వరల్డ్ కప్‌లో అనిల్ కుంబ్లే, 2011 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్‌లు 15 వికెట్లు పడగొట్టగా తాజాగా రవీంద్ర జడేజా 16 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇద్దరు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా రెండు వికెట్లు తీయడంతో ఈ రికార్డును సృష్టించాడు. సింగిల్ ఎడిషన్‌లో మాత్రం జహీర్‌ఖాన్ 2011లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. అయితే నెదర్లాండ్స్‌పై భారత జట్టు 160 పరుగులతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News