Wednesday, January 22, 2025

జడేజాకు జరిమానా..

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఐసిసి జరిమానా విధించింది. ఆసీస్‌తో జరిగిన తొలిటెస్టులో రవీంద్ర జడేజా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించడంతోపాటు ఒక పాయింట్‌ను డిమెరిట్ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో జడేజా అంపైర్ అనుమతి తీసుకోకుండా ఎడమ చూపుడు వేలిపై ఆయింట్‌మెంట్ రాసుకున్నాడు.

దీనిపై ఆసీస్ క్రికెటర్లతోపాటు క్రికెటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు పడగొట్టడంతో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచాయి. అయితే ఆరోపణలపై విచారించిన మ్యాచ్ రిఫరీ ఆయింట్‌మెంటును చేతి వేలి వాపు తగ్గించేందుకు ఉపయోగించాడని నిర్ధారించారు. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2వికెట్లు తీసిన జడేజా రాణించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్‌సెంచరీతో మెరిశాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News