Monday, December 23, 2024

జడేజా ఔట్… టీమిండియా 131/4

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 38 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 12 పరుగులు చేసి షోయిబ్ బషీర్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ (38), రజత్ పాటీదర్ (17), రవీంద్ర జడేజా (12), రోహిత్ శర్మ(02) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (54), సర్ఫరాజ్ ఖాన్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News