- Advertisement -
చెన్నై: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్రా జడేజా మరో అరుదైన రికార్డు సాధించాడు. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జరగిన మ్యాచ్‌లో జడేజా మూడు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. అన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. జడేజా ఇప్పటి వరకూ అస్ట్రేలియాపై 37 వికెట్లు తీసుకున్నాడు. అయితే కపిల్ దేవ్ 45 ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 38 వికెట్లతో మహ్మద్ సమీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే మహ్మద్ సమీని వెనక్కి నెట్టి జడేజా రెండో స్థానానికి చేరుకోనున్నాడు. ఇక జడేజా తర్వాత అజిత్ అగార్కర్ (36 వికెట్లు), జగగల్ శ్రీనాథ్ (33 వికెట్లు), హర్భజన్ సింగ్ (32 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.
- Advertisement -