Monday, January 20, 2025

రవీంద్ర జడేజా దెబ్బకు ఆసీస్ విలవిల

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు ఆస్ట్ర్రేలియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. గాయం కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న ఈ ఆల్ రౌండర్ విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్త్రేలియా మధ్య తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో రెచ్చిపోయాడు. తన లెఫ్టార్మ్ స్పిన్ తో ఆసీస్ వెన్నువిరిచాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను పరేషాన్ లో పడేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఆశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. జడేజా, అశ్విన్ పోటాపోటీగా వికెట్లు తీసి భారత్ కు తొలి రోజు ఆటలో పైచేయి సాధించిపెట్టారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్త్రేలియా మధ్య తొలి టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News