Wednesday, January 22, 2025

నా పాత్ర ఏంటో తెలుసు.. కెప్టెన్ గానే ఆలోచిస్తా: జడేజా

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ విజయ దుందుబీ కొనసాగుతోంది. వరుసగా 8వ విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సఫారీ బ్యాట్స్ మెన్లను భారత బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి వికెట్లు తీశారు. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. సౌతాఫ్రికాను 83 పరుగులకే పరిమితం చేసి.. 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..ఆటు బ్యాట్ తో, ఇటు బంతితోనూ రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

మ్యాచ్ అనంతరం మీడియాతో జడేజా మాట్లాడుతూ.. “ఆల్ రౌండర్ గా నా పాత్ర ఏంటో తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు 30-35 పరుగులు చేయడంతోపాటు కీలక సమయంలో వికెట్లు తీయడం నా బాధ్యత. డే వన్ నుంచి నేను కెప్టెన్ గానే ఆలోచిస్తా. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పడు సన్నద్ధమవుతూ.. మ్యాచ్ పై నా ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తా. ఫీల్డింగ్ లో నేనే గొప్ప అని అనుకోను. మరింత మెరుగ్గా ఫీల్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా మ్యాచ్ లో లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బౌలింగ్ చేశా. ప్రారంభంలోనే పేసర్లు వికెట్లు తీయడం.. స్పిన్నర్లపై ఒత్తిడి తగ్గి మరింత సులువుగా బౌలింగ్ వేసేందుకు సహాయపడుతుంది. కీలక మ్యాచ్ లో రాణించినందుకు ఆనందంగా ఉంది” అని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News