Thursday, January 23, 2025

ఎన్‌డిటివికి సీనియర్ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్, మెగాసెసే అవార్డు గ్రహీత రవీశ్ కుమార్ ఎన్‌డిటివికి రాజీనామా చేశారు. ఆ ఛానల్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తమ బోర్డు డైరక్టర్ పదవులకు రాజీనామా చేశాక ఆయన కూడా ఆ సంస్థకు రాజీనామా చేశారు. ఎన్‌డివి గ్రూప్ అధ్యక్షుడు సుపర్ణ సింగ్ ఈమెయిల్ ద్వారా రవీశ్ కుమార్ రాజీనామ చేశారని తెలిపారు. ఆయన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని కూడా తెలిపారు. ఎన్‌డిటివి ఇదివరలో ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ ప్రయివేట్ లిమిటెడ్ కింద పనిచేస్తుండేది. దానిని అదానీ గ్రూప్ వాళ్లు కైవసం చేసుకున్నారు. ఎన్‌డిటివి ప్రమోటర్ ‘ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్’ 2022 నవంబర్ 28న తన 99.5 శాతం ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ యాజమాన్యంలోని ‘విశ్వప్రధాన్ కమర్షియల్’కు బదిలీ చేసింది. దాంతో ఈ పరిణామం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News