Wednesday, January 15, 2025

బిజెపి, కాంగ్రెస్ లది ఫెవికాల్ బంధం: రావుల శ్రీధర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలపై బిఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ లది ఫెవికాల్ బంధం అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిజెపి, కాంగ్రెస్ మాటాలున్నాయని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ దొంగల పార్టీ అనే విమర్శలను తిప్పికొట్టారు రావుల. బిఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎందుకిస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తోందని రావుల మండిపడ్డారు. ఇప్పుడు కోడ్ పేరు చెప్పడం చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుస్తోందని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News