టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని సిఎం రేవంత్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాయదుర్గం- నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నిర్మించిన తలపెట్టిన మెట్రో ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని సూచించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్‌ను పెండింగ్‌లో పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్‌ను కోరారు. ఎల్‌అండ్‌టి యొక్క రాయితీ ఒప్పందం, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లో జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ సహకారంపై విచారణ జరిపి సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీని పాతబస్తీ మీదుగా, ఎల్‌బి నగర్ మీదుగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు, దాని విస్తరణ ప్రణాళికలు, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజె క్ట్ మొదలైన వాటిపై ఆయన సవివరమైన సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధికి ఆస్కారం తక్కువగా ఉండి ఇప్పటికే జి.ఓ.111 ప్రాంతం ద్వారా ఓఆర్‌ఆర్‌తో పాటు ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను గత ప్రభుత్వం ఎలా నిర్ధారించిందో తెలుసుకోవాలన్నారు. ఓఆర్‌ఆర్ రూపంలో చాలా మంచి రవాణా సౌకర్యం ఉంది. నగర జనాభాలో ఎక్కువ భాగం సెంట్రల్, తూర్పు ప్రాంతాలలో, పాత నగరంలో ఉన్నందున, ఎంజిబిఎస్, -ఫలక్‌నుమా నుండి పాత నగరం గుండా ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. చాలా మంది సామాన్య ప్రజలకు సేవ చేసేందుకు ఎల్‌బి నగర్ ప్రాంతం నుండి నగరాన్ని అన్ని దిశలకు సమానంగా అభివృద్ధి చేసి విస్తరించాలని, భౌగోళిక పరిమితులు లేని ప్రపంచ నగరంగా హైదరాబాద్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ఇప్పటికే 40 శాతం పట్టణీకరణలో ఉందని, మరింత వేగంగా పట్టణీకరణ చెందుతోందనే వాస్తవాన్ని గుర్తించాలని, హైదరాబాద్ నగరాన్ని మొదట్లో రెండు కోట్ల మంది జనాభాకు, చివరికి సుమా రు మూడు కోట్ల జనాభాకు అనుగుణంగా ఓఆర్‌ఆర్, మెట్రో రైల్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ ఆదేశించారు.
ఈ శాటిలైట్ టౌన్‌షిప్‌లకు సరసమైన, వేగవంతమైన కనెక్టివిటీని అందించడంలో ముఖ్యమైన పాత్ర అని అన్నా రు. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్ ప్లాన్‌ను, టెండర్‌ను పెండింగ్‌లో ఉంచాలని, ఎంజీబీఎస్-, ఫలక్‌నుమా నుంచి, ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి మరియు P7 రోడ్ మీదుగా (1) తీసుకునే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని ఎండి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ని ఆయన ఆదేశించారు, లేదా (2) బార్కాస్-పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్ ద్వారా. సరళ రేఖ అలైన్‌మెంట్ ఖర్చులను ఆదా చేయగలిగితే, మొత్తం భూమి ప్రభుత్వానిది కాబట్టి విమానాశ్రయ ప్రాంగణంలోని బహిరంగ ప్రదేశాలను తొలగించవచ్చని రేవంత్ రెడ్డి కోరారు. కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భారీ విస్తీర్ణంలో పర్యావరణ అనుకూల మెగా టౌన్‌షిప్‌కు ప్రణాళిక రూపొందించాలని సీనియర్ అధికారులకు సూచించారు. కాలుష్య కారకమైన ఫార్మా సిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండకూడదని, దానికి బదులుగా సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుండి శ్రీశైలం రోడ్‌లోని తుక్కుగూడ మీదుగా ఈ మెగా కొత్త నగరానికి మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తికానప్పటికీ మెట్రో రైల్ రాయితీ సంస్థకి అనేక ప్రయోజనాలు అందజేయడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మేర మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని అక్కడ ఉన్న ఉన్నతాధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధికి మధ్య సమతూకంతో వ్యవహరిస్తోందని, మూసీ సుందరీకరణ, ఒడ్డున ఉన్న మార్గాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు నగరానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీనియర్ ఆదేశించారు. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్‌ను సక్రమంగా కలుపుతూ నాగోల్ నుండి గండిపేట వరకు తూర్పు-పశ్చిమ రహదారి- కమ్ -మెట్రో రైలు కనెక్టివిటీ కోసం ప్లాన్ చేయడానికి. ఒకవైపు ఆగ్నేయాసియా, మరోవైపు పశ్చిమ, గల్ఫ్ దేశాల మధ్య లాజిస్టిక్స్, మెడికల్ హబ్‌గా హైదరాబాద్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు ఆలోచించాలని అధికారులకు సూచించారు.