Thursday, January 23, 2025

రాయదుర్గం కిడ్నాప్ డ్రామేనా…?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ విషయం అంతా ఒక డ్రామాగా పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. కూకట్‌పల్లికి చెందిన సురేందర్‌ను కొంతరు వ్యక్తులు వచ్చి కారులో కిడ్నాప్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి నిందితులు తర్వాత అతడి భార్య ఫోన్ చేసి రూ.2కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సురేందర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులు ఎపిలోని కర్నూలు జిల్లా వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిసింది. నలుగురు టీములను ఏర్పాటు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.నిందితులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సురేందర్‌ను నల్లమల అడవులకు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అక్కడి ఫారెస్ట్ అధికారులుకు చెప్పారు.

వెంటనే వారు అప్రమత్తమై కిడ్నాపర్లు వస్తున్న కారును గుర్తించారు. వారిని ఆపి తనిఖీ చేయగా అక్కడి నుంచి కిడ్నాపర్లు సురేందర్‌ను కిడ్నాపర్లు అక్కడే వదిలేసి పారిపోయారు. అందులో నుంచి ఒక కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా సురేందర్‌ను నిందితులు ఇలాగే కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మరోసారి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిసింది. దానికి అనుగుణంగానే సురేందర్ భార్య కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.2కోట్లను తన పుట్టింటి నుంచి ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిసింది. పోలీసులు ఆదివారం నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News