Tuesday, November 5, 2024

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నివేదికపై మూడు వారాల సమయం కావాలి

- Advertisement -
- Advertisement -

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

Rayalaseema Irrigation Scheme

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎన్జీటికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి నివేదిక ఇచ్చేందుకు మూడు వారాల సమయం కావాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో నేడు (సోమవారం) విచారణ ఉన్న నేపథ్యంలో ఎన్జీటీకి బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన కోసం నియమించిన కేంద్ర జలసంఘం సంచాలకులు పి. దేవేందర్‌రావు స్థానంలో మరొకరిని నామినేట్ చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది. తెలంగాణకు చెందిన దేవేందర్‌రావు పరిశీలన బృందంలో ఉండడంపై ఎపి ప్రభుత్వం గతంలో అభ్యంతరం చెప్పింది. తెలుగు రాష్ట్రాల వారెవరూ లేకుండా రాయలసీమ పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటి కృష్ణా బోర్డును ఆదేశించింది. దీంతో దేవేందర్‌రావు స్థానంలో ప్రాజెక్టుల డిపిఆర్, డిజైన్, ఇన్వెస్టిగేషన్‌లపై అవగాహన ఉన్న చీఫ్ ఇంజనీర్ లేదా సంచాలకుల స్థాయి అధికారిని నామినేట్ చేయాలని కోరినట్లు కెఆర్‌ఎంబీ తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆ బృందం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కెఆర్‌ఎంబీ తెలిపింది. ఆ తరువాత నివేదిక సమర్పిస్తామని ఎన్జీటికి వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News